![]() |
![]() |
.webp)
మెగా ఫామిలీలో కొత్త పెళ్లి కొడుకు వరుణ్ తేజ్ ఒక పోడ్కాస్ట్ లో ఎన్నో విషయాలు చెప్పాడు. "రీసెంట్ గా పెళ్లయ్యాక లావణ్యతో కలిసి ఫిన్ ల్యాండ్ హనీ మూన్ ట్రిప్ వెళ్లాను. నేను ఎక్కుగా టైం స్పెండ్ చేస్తాను లావణ్య మాత్రం చాలా తక్కువగా టైం స్పెండ్ చేస్తుంది. ఖర్చు కూడా నేనే ఎక్కువ పెడుతూ ఉంటా. ఎక్కువగా రకరకాల షూస్ కొనడం నాకు ఇష్టం. కోపం తెచ్చుకోవడం పెద్ద గొప్ప విషయం కాదు. ఒకసారి నేను చాలా కాస్ట్లీ ఫోన్ విసిరేసా. తర్వాత మళ్ళీ అది పగిలిపోయిందేమో అనుకుని చూసుకున్నా...అంత కాస్ట్లీ ఫోన్ మళ్ళీ ఇంట్లో వాళ్ళు కొనివ్వలేరు కదా అనుకున్నా. తర్వాత కోపం తగ్గించుకున్నా. ఒకవేళ కోపం వస్తే దిండును విసిరికొడతా తప్పా ఇంకేం చేయను.
ఇక మేము భవన్స్ స్కూల్ లో చదువుకునేటప్పుడు ఒకసారి స్కూల్ గోడ దూకి బంక్ కొట్టేసరికి ఆ తర్వాత స్కూల్ చుట్టూ ఫెన్సింగ్ పెట్టించారు. అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయాలంటే నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండాలి. నీ పర్సనాలిటీని మార్చుకోవద్దు. ఒకవేళ అలా మార్చుకుంటే గనక ఎక్కువ రోజులు నువ్వు సస్టైన్ అవ్వలేవు. హ్యూమరస్ గా ఉండడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఫన్నీగా, సరదాగా ఉండేవాళ్లు చుట్టూ ఫ్రెండ్స్ ఉంటారు. కొంత మనం హ్యూమరస్ గా ఉండాలి, ఎవరైనా హ్యూమరస్ జోక్స్ వేసిన తీసుకోవాలి. ఇంట్లో వాళ్ళు ఆదేశిస్తే జనసేన కోసం ఏమైనా చేస్తాను. ఎందుకంటే నా కంటే మా నాన్న బాబాయ్ ని దగ్గర నుంచి చూసారు కాబట్టి. బాబాయ్ కళ్ళు ఎప్పుడూ వేరేవాళ్ళ మీద ఉండేవి కావు ..సమాజం మీద, పేదవాళ్ల మీదే ఉండేవి. ఆయన ఎంతో కంఫర్ట్ ని లగ్జరిని వదిలేసి ప్రజల్లోకి వచ్చేసారు. చేయాలనుకే తపన ఆయనకు ఉంది...చేస్తున్నారు. మా బాబాయ్ అని కాదు గాను ఆయన చేసే మంచి పనుల కోసం కూడా నేను జనసేన తరపున ప్రచారం చేస్తాను.' అని చెప్పాడు వరుణ్ తేజ్. ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఈ ఇంటర్వ్యూ ఇచ్చాడు వరుణ్.
![]() |
![]() |